యాత్ర టీజర్ విడుదల : పంచకట్టులో అచ్చం వైఎస్ లానే మమ్ముట్టి

yatమాజీ సీఎం వైఎస్. రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న యాత్ర మూవీ టీజర్ విడుదలైంది. జులై-8న వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా టీజర్ ను విడుదల చేసింది మూవీ యూనిట్. పంచకట్టులో అచ్చం వైఎస్ లాగే మమ్ముట్టి చేస్తున్న అభివాదం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో వైఎస్ గా నటిస్తుండగా ,ఆనందోబ్రహ్మ ఫేమ్‌ మహి వీ రాఘవ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ పతాకంపై విజయ్ చల్లా, శశిదేవ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తెలుసుకోవాలని ఉంది.. వినాలని ఉంది.. ఈ గడప దాటి ప్రతీ గడపలోకి వెళ్లాలని ఉంది.. వారితో కలిసి నడవాలని ఉంది.. వారి గుండె చప్పుడు వినాలని ఉంది. గెలిస్తే పట్టుదల అంటారు.. ఓడితే మూర్ఖత్వం అంటారు. పాదయాత్ర మూర్ఖత్వమో లేక పట్టుదలో చరిత్రే నిర్ణయిస్తుంది అంటూ సాగే టీజర్ అభిమానుల్లో మూవీపై  అంచనాలు పెంచేసింది. ఈ సినిమా షూటింగ్ ను త్వరలో పూర్తి చేసి విడుదల చేసేందుకు మూవీ టీమ్ ప్రయత్నాలు చేస్తుంది. టాలీవుడ్ లో ఇటీవల కాలంలో వచ్చిన బయోపిక్ లు మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates