యాత్ర సినిమా : వైఎస్ రూపంలో మమ్ముట్టి ఇలా

yathra-firstlookవైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా యాత్ర. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్ర పోషిస్తున్నారు. దీనికి సంబంధించి స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. వైఎస్ పాదయాత్రలో కనిపించిన రూపంలోనే ఇప్పుడు మమ్ముట్టి కనిపించారు. కడప దాటి ప్రతి గడపలోకి వస్తున్నాను.. మీతో కలిసి నడవాలనుంది.. మీ గుండె చప్పుడు వినాలనుంది.. అంటూ క్యాప్షన్ పెట్టారు. ఏప్రిల్ 9వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

వైఎస్ రూపంలో మమ్ముట్టి ఒదిగిపోయాడు. అచ్చం అలాగే పంచె కట్టు ఉంది. అదే విధంగా చేతితో చేస్తున్న అభివాదం కూడా వైఎస్ ను గుర్తుకు తెస్తోంది. ఈ మూవీకి మహి వి.రాఘవ దర్శకత్వం వహిస్తున్నాడు. మహా ప్రస్థానం పేరుతో వైఎస్ చేపట్టిన పాదయాత్ర క్రమంలో ఈ కథ ఉంటుంది.

Posted in Uncategorized

Latest Updates