యాదాద్రికి LED వెలుగులు

యాదాద్రి గుట్టలు కొంగొత్తగా వెలిగిపోతున్నాయి. LED లైట్ల వెలుగుల్లో యాదాద్రి లక్ష్మీనరసింహుడు కొత్త శోభను సంతరించుకున్నాడు. గుట్ట కళకళలాడుతోంది. రాత్రి వేళ వెలుగులు విరజిమ్ముతున్న కొండలు… చూసేవారిని కట్టిపడేస్తున్నాయి. యాదాద్రి అభివృద్ధిలో భాగంగా.. ఘాట్ రోడ్లపై ఏర్పాటు చేసిన LED లైట్లు కొండకు కొత్త అందాలనిచ్చాయి. ఇటలీ నుంచి తెప్పించిన LEDలైట్ల వెలుతురులో ఘాట్ రోడ్లు మెరిసిపోతున్నాయి. LED లైట్ల వెలుగు.. భక్తులు, స్థానికులను కట్టిపడేస్తోంది. కొండపైకి వెళ్లేందుకు నిర్మించిన రెండో ఘాట్ రోడ్డుకు రెండువైపులా ఈ లైట్లను అమర్చారు. LED లైట్ల కోసం 50 లక్షలు ఖర్చు చేశారు. ఇటలీకి చెందిన నీరీ అనే సంస్థ వాటిని తయారు చేసింది. తయారీకి 6 నెలలు కాగా.. యాదాద్రికి తీసుకొచ్చేందుకు 3 నెలలు పట్టిందని అధికారులు తెలిపారు.

ఈ రకమైన ఎల్ఈడీ లైట్లను గతంలో తంజావూర్, ముంబయిలోని ఛత్రపతి శివాజీ, బాల్ థాక్రే స్మారక స్థూపాలు, సుప్రీంకోర్టు, ఇండియా గేట్, విజ్ఞాన్ భవన్ల దగ్గర ఏర్పాటు చేసింది నీరి సంస్థ. దానికిగానూ ఆ సంస్థకు ప్రశంసలు, అవార్డులు వచ్చాయి. యాదాద్రిలో అమర్చిన లైట్లలో క్యాస్ ఐరన్ అనే లోహంతో లోపల ఒక పైపు, పైన ఒక పైపు అమర్చి, నరసింహస్వామి చిత్రాన్ని స్తంభం మధ్యలో పెట్టి తయారు చేశారు.

రెండో ఘాట్ రోడ్డుకు రెండువైపులా 50 LED లైట్లను ఏర్పాటు చేశారు. భక్తులు, స్థానికులు లైట్ల వెలుగులను ఆస్వాదిస్తున్నారు. తక్కువ కరెంట్ తో.. LED ఎక్కువ వెలుతురు విరజిమ్ముతున్నాయి. రాత్రివేళ గుడికి వెళ్లే భక్తులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నాయి. ప్రమాదాల నివారణకు కూడా ఉపయోగపడుతోందంటున్నారు భక్తులు.

Posted in Uncategorized

Latest Updates