ఏడాదిలోనే పూర్తి : యాదాద్రిలో పడమర సప్తతల మహారాజ గోపురం

యాదాద్రి : తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా పడమర సప్తతల మహారాజగోపుర నిర్మాణం పూర్తయ్యింది. ముందుగా మహాపద్మం శిలలను అమర్చిన శిల్పులు, ఆ తర్వాత శిల మహానాసి తల శిలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అమర్చినట్లు తెలిపారు వైటీడీఏ స్తపతి అడ్వయిజర్‌ సుందరరాజన్‌, స్తపతి ఆనందాచారివేలు. సప్తతల మహారాజగోపురంపై శిల్పాలు, కలశాల ఏర్పాటు జరగాల్సి ఉందన్నారు. త్వరలోనే మిగిలిన శిల్పి నిర్మాణ పనులు పూర్తిచేయనున్నట్లు, దీంతో ఆలయ విస్తరణ పనులు చివరి అంకానికి చేరుకున్నట్లు తెలిపారు

ప్రధానాలయం చుట్టూ నాలుగు వైపులా నాలుగు ఐదంతస్తుల రాజగోపురాలు.. ఈశాన్య దిశలో త్రితల రాజగోపురం.. స్వయంభువులు కొలువైన గర్భాలయంపైన పంచతల బంగారు విమాన రాజగోపురం.. పడమర సప్తతల మహారాజగోపుర నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు వైటీడీఏ అధికారులు. 2016 అక్టోబరు 11న ఆలయ రాజగోపుర శిల్పి నిర్మాణాలకు శిలాన్యాస పూజలు నిర్వహించారు. 2017 డిసెంబరు 16న సప్తతల మహారాజ గోపుర నిర్మాణానికి శిల్పులు, స్తపతులు సంప్రదాయ రీతిలో శ్రీకారం చుట్టారు. నిన్నటి(2018 డిసెంబర్ 13)తో సప్తతల మహారాజగోపుర నిర్మాణం పూర్తయ్యింది. అయితే ఏడాదిలోనే ఈ నిర్మాణం పూర్తయ్యింది.  ఈ సప్తతల మహారాజగోపుర నిర్మాణం 65 లేయర్లతో నిర్మించారు. 50 మంది శిల్పులు ఈ గోపుర నిర్మాణంలో పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates