యాదాద్రిలో పెరిగిన పోలీసుల నిఘా

యాదాద్రిలో పోలీసుల నిఘా పెరిగింది. అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు మొదలు పెటట్రు. యాదగిరిగుట్టలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. నలుగురిపై కేసు పెట్టి… జైలుకు తరలించారు. ఆలయ పవిత్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో వ్యభిచార వృత్తి నిర్మూలనకు రాచకొండ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై పీడీ యాక్ట్ పెడుతున్నారు. గణేష్ నగర్ ప్రాంతంలో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న.. నలుగురు మహిళలపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

వ్యభిచార వృత్తి మానుకోవాలని గతంలో అనేకసార్లు అవగాహన కల్పించినా.. వీళ్ల తీరు మారలేదంటున్నారు పోలీసులు. కొందరు అదే వృత్తిని కొనసాగిస్తుండటంతో నలుగురు వ్యభిచార గృహాల నిర్వాహకులపై పీడీ యాక్ట్ పెట్టినట్లు తెలిపారు. ఈ నలుగురు మహిళలు ఒక ముఠాగా ఏర్పడి వ్యభిచార వృత్తిని ప్రోత్సహిస్తున్నారని గుర్తించినల్లు తెలిపారు. ఇతర ప్రాంతాల యువతులను నమ్మించి వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని తెలిపారు. తప్పని పరిస్థితిలో వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించామన్నారు ఏసీపీ. వ్యభిచార గృహాలు, వీటి నిర్వాహకుల కారణంగా పవిత్ర పుణ్యక్షేత్రంలో అసాంఘిక కార్యకలాపాలు సాగడంతో.. భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆలయ పవిత్రను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates