యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

YADAయాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. హాలీడేస్ కావడంతో నరసింహస్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో.. కొండ కిటకిటలాడుతోంది. కల్యాణ, వ్రత మండపాలతో పాటు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి 4గంటలకు పైగా సమయం పడుతోంది. రద్దీ దృష్ట్యా వీఐపీ దర్శనాలు రద్దు చేశారు ఆలయ అధికారులు. ఎండలు రికార్డు స్థాయిలో కొడుతున్నా.. సరైన సౌకర్యాలు లేవంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా వసతి గృహాలు కూల్చడంతో ఇబ్బందులు పడుతున్నారు. కనీసం సరిపడ చలువ పందిళ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యూలైన్లలో కనీసం మంచినీళ్లు కూడా లేవంటున్నారు భక్తులు.

Posted in Uncategorized

Latest Updates