యాదాద్రిలో వరుణయాగం : వర్షాల కోసం ఊరూవాడా పూజలు

అయితే దంచికొట్టడం… లేదంటే పత్తాలేకుండా పోవుడం.. ఇది ప్రస్తుతం రాష్ట్రాల వానల పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడితే.. మరికొన్ని ప్రాంతాల్లో కనీసం సాధారణ వర్షాలు కూడా పడలేదు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురవాలని పూజలు చేస్తున్నారు.  యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వరుణ యాగం పూజలు వైభవంగా జరుగుతున్నాయి.

గురువారం స్వస్తివచనం, విశ్వక్సేన పూజలతో ప్రారంభమైన యాగం రెండో రోజుకు చేరుకుంది. శుక్రవారం (ఆగస్టు-3) రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని వరుణయాగం నిర్వహిస్తున్నామన్నారు పూజారులు. దేవాదాయశాఖ కమిషనర్ ప్రతి ఆలయంలో వరుణ యాగం నిర్వహించాలని ఆదేశించడంతో, యాదాద్రిలో ఆగస్టు 6 వరకు వరుణ యాగం జరుపుతున్నామన్నారు ఆలయ ఈవో.

సిద్ధిపేట జిల్లాలో వర్షాల కోసం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. హుస్నాబాద్ మండలం ఆరెపల్లిలో గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. గ్రామస్థులంతా.. బిందెల్లో పసుపు నీటిని తెచ్చి.. పోచమ్మ, హనుమాన్ దేవాలయాల్లో జలాభిషేకం జరిపారు. వర్షాలు కురవాలని మహిళలంతా ఓ చోట చేరి వాన పాటలు పాడారు.

Posted in Uncategorized

Latest Updates