యాదాద్రి: ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు

YADADRIయాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 9వ రోజు స్వామివారు శ్రీమహావిష్ణు అలంకారంలో గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వజ్ర వైఢూర్యాల ధరించిన స్వామివారు దగదగ మెరిసిపోయారు. రాత్రి 7 గంటలకు బాలాలయంలో రథోత్సవం, 8 గంటలకు కొండ కింద స్వామివారి ప్రచార రథం ఊరేగింపు వైభవంగా జరపనున్నారు. దాంతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు చేశారు. ఆలయ చరిత్రలో రెండోసారి రథోత్సవ తంతును కొండ కింద నిర్వహిస్తుండటంతో పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates