యాదాద్రి: ఘనంగా స్వామివారికి చక్రస్నానం

ోలదదియాదాద్రి  శ్రీ లక్ష్మీనరసింహస్వామి  బ్రహ్మోత్సవాలు  వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు మధ్యాహ్నం  పూర్ణాహుతి  కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.  తర్వాత బాలాలయంలో స్వామివారి చక్రస్నాన ఘట్టం జరిగింది.   కొండపైన ఉన్న  పుష్కరిణి  నుంచి  పుణ్య జలాలను  తీసుకొచ్చి… ఉత్సవ మూర్తులకు  చక్రస్నానం చేయించారు  అర్చకులు. ఈ సమయంలో  భక్తులు కూడా  పెద్ద సంఖ్యలో పుష్కరిణిలో  స్నానాలు ఆచరించారు.  రేపు(మంగళవారం-27) ఉదయం  అష్టోత్తర  శత  ఘటాభిషేకంతో  బ్రహ్మోత్సవాలకు ముగింపు  పలకనున్నారు పండితులు.

 

Posted in Uncategorized

Latest Updates