యాదాద్రి బ్రహ్మోత్సవాలు : వైభవంగా రథోత్సవం

yadadri0217తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణ లక్ష్మీనారసింహులు ఆదివారం (ఫిబ్రవరి-25) రాత్రి దివ్య విమాన రథంపై ఊరేగారు. యాదాద్రి ఆలయం పునఃనిర్మాణంలో ఉన్న క్రమంలో ఈ రథోత్సవాన్ని ఆగమ నియమాలకు అనుగుణంగా బాలాలయ ఉత్సవ మండపంలో నిర్వహించారు. వేదమంత్రాలతో ఆలయ అర్చకులు రథాంగ హోమం జరిపారు. ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకారం జరిపి.. స్వామివారిని ప్రచార రథంపై కొండ కింద పట్టణవీధుల్లో ఊరేగించారు.

కొండ కింద స్వామివారి వైకుంఠ ద్వారం నుంచి పట్టణ ప్రధాన వీధుల గుండా భక్తుల కోలాట నృత్యాలు, భజనల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతకుముందు తిరుకల్యాణ లక్ష్మీనారసింహులను గరుడ వాహనంపై ఊరేగించారు వెండి గరుడ సేవలో భాగంగా స్వామివారు.. విష్ణుమూర్తి అలంకారంలో తన ఇష్టవాహనమైన గరుత్మంతుడిపై దేవేరి శ్రీమహాలక్ష్మీ అమ్మవారి సమేతంగా ఉత్సవ మండపంలో ఊరేగారు.

Posted in Uncategorized

Latest Updates