యానాం-కాకినాడ మధ్య తీరం దాటిన పెథాయ్ తుపాను

ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కోస్తాతీరంలో పెథాయ్ తుపాను తీరం దాటింది. సరిగ్గా 3 గంటల 24 నిమిషాలకు యానాం-కాకినాడ మధ్య తీరాన్ని దాటింది. తుపాను తీరాన్ని దాటే క్రమంలో వంద కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. తుపాను కేంద్రం తుని నుంచి ఒడిశా వైపు కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తుని, పాడేరు, పాయకరావుపేట ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికీ జాగ్రత్తగానే ఉండాలని చెప్పారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. తుపాను తీరం దాటే సమయానికి… 400 కరెంట్ స్తంభాలు నేల కూలినట్లు సమాచారం ఉందన్నారు. 25 వేల మందికి 147 కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు అధికారులు.

 

Posted in Uncategorized

Latest Updates