శరీర బరువు అదుపులో ఉంచే ‘యాపిల్ టీ’

ఆపిల్‌ తినడం వల్లే కాకుండా… ఈ ఆపిల్‌ ఫ్లేవర్ టీతో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీకి బదులు ఈ టీని ట్రై చేస్తే…కొంచెం కొ త్తగా… ఇంకొంచెం ఆరోగ్యం గా ఉండొచ్చు. బాడీ ఫిట్‌ గా ఉండటంతో పాటు అధిక బరువును తగ్గించేందుకు గ్రీన్ టీ, ఐస్ టీ బాగా ఉపయోగపడతాయి. అలాగే యాపిల్ టీ కూడా శరీర బరువుని అదుపులో ఉంచడంలో సమర్థంగా పని చేస్తుంది. ఈ టీ చాలా రుచిగా కూడా ఉంటుంది. యాపిల్ పండు తొక్కలో అనేక పోషకాలున్నాయి. దాన్ని కూడా టీలో ఉపయోగించవచ్చు. యాపిల్ టీ యూరప్‌ లో ఎంతో ఫేమస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఈ టీ తాగడం వలన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉదర సంబంధ సమస్యలన్నింటికీ యాపిల్ టీ చక్కటి ఔషధం. యాపిల్ టీని తరచూ తాగడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.జాయింట్ పెయిన్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. యాపిల్ టీ తాగితే చర్మ సౌందర్యం పెరుగుతుంది.

యాపిల్ టీ తయారీ

ముందుగా యాపిల్‌ ని శుభ్రంగా కడిగి చిన్నము క్కలుగా కట్‌ చేసుకోవాలి. తర్వాత ఒక పాత్రలో టీకి సరిపడా నీళ్లు తీసుకొని అందులో యాపిల్‌ ముక్కలు వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత టీ పొడి, లవంగాలు, దాల్చిన చెక్క కొంచెం వేసి కలిపి… మరికాసేపు మరిగించాలి. చివరిగా కొంచెం తేనె కలపాలి. టీ కాస్త ‌చల్లబడిన తర్వాత తాగాలి.

Posted in Uncategorized

Latest Updates