యాపిల్ విలువ లక్ష కోట్ల డాలర్లు


ఐఫోన్‌ను సృష్టించిన ఆపిల్‌ అమెరికా స్టాక్‌ మార్కెట్లో చరిత్ర సృష్టించింది. మొదటి సారిగా లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ.69 లక్షల కోట్లు) మార్కెట్‌ విలువ సాధించింది. గురువారం నాస్‌డాక్‌లో, ట్రేడింగ్‌ ప్రారంభంలోనే యాపిల్‌ షేర్‌ 207.05 డాలర్ల ధరను తాకింది. దీంతో  లక్ష కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువను ఆ సంస్థ సాధించినట్లు అయింది. వరల్డ్ లోనే ఈ ఘనతను సాధించిన మొదటి లిస్టెడ్ కంపెనీగా యాపిల్ రికార్డు సృష్టించింది.

1977లో ఒకానొక దశలో దివాలాకు చేరుకున్న యాపిల్.. తర్వాత వినూత్న ఉత్పత్తులతో మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ విలువకు చేరుకుంది. కొత్త తరం ఐ ఫోన్లు సెప్టెంబర్ లో విడుదల కానున్నవార్తలతో గత వారం రోజులుగా యాపిల్ షేర్ దూసుకెళ్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు యాపిల్ షేర్ 22 శాతం పెరిగింది. ఇప్పుడు యాపిల్‌ మార్కెట్‌ క్యాప్‌.. మొత్తం మెక్సికో ఆర్థిక వ్యవస్థకు సమానం. లక్ష కోట్ల డాలర్లు అంటే.. అర్జెంటీనా, నెదర్లాండ్స్, స్వీడన్‌ తదితర 27 ప్రధాన దేశాల మొత్తం జీడీపీకి సమానం. మన కరెన్సీలో దాదాపు రూ.69 లక్షల కోట్లతో సమానం.

Posted in Uncategorized

Latest Updates