యుద్ధానికి రెడీ : వైమానిక దళంలో మహిళా ఫైటర్‌ పైలట్‌

 భారత వైమానిక దళంలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది. రాజస్తాన్‌ కు చెందిన ప్రియాశర్మ అనే మహిళ ఇటీవల ఫైటర్‌‌‌‌ పైలట్‌ గా ఎంపికైంది. దేశంలో యుద్ధ విమానానికి పైలట్‌ గా ఎంపికైన ఏడో మహిళగా నిలిచింది. రాజస్తాన్‌ నుంచి ఈ ఘనత సాధించిన మూడో మహిళ కూడా ప్రియా శర్మే. హైదరాబాద్‌ కు సమీపంలోని దుండిగల్‌ ఎయిర్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ అకాడమీలో పైలట్‌ గా శిక్షణ పూర్తి చేసుకుంది. ఇక్కడి అకాడమీలో ఈ ఏడాది 139 మంది శిక్షణ పొందారు. వీళ్లలో పైలట్లుగా 35 మంది ట్రైనింగ్‌ తీసుకోగా, వారిలో ప్రియా శర్మ ఒక్కరే మహిళ కావడం విశేషం.

ప్రియా శర్మ తండ్రి కర్ణాటకలోని బీదర్‌‌‌‌ ఎయిర్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ స్టేషన్‌ లో ‘ఎయిర్‌‌‌‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌‌‌‌’గా పని చేసేవాడు. ఆయన స్ఫూర్తితో విమానాలపై ఆసక్తి కలిగిన ప్రియా శర్మ పైలట్‌ కావాలని నిర్ణయిం చుకుంది. తండ్రి ప్రోత్సాహంతో అకాడమీలో చేరి శిక్షణ పూర్తి చేసుకుని, త్వరలో సైన్యంలో సేవలు అందించనుం ది. దేశానికి సేవ చేసేందుకు వైమానిక దళం మంచి అవకాశమని, పైలట్‌ గా సమర్ధమంతంగా పని చేస్తానని ప్రియాశర్మ తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates