యుద్ధాలు తప్పవు : మంచినీటి కోసం భారత్ విలవిల

Maha-Beed

భారత్ లో ఒక్క చుక్క నీటి కోసం కొట్టుకునే పరిస్ధితులు ఏర్పడనున్నాయా అంటే అవుననే చెబుతున్నాయి రిపోర్టులు. ఒక్క బెంగళూరునే కాకుండా భారత్ మెత్తం కేప్ టౌన్ పరిస్ధితులను ఎదుర్కొనబోతుందా? దేశంలోని కుళాయిల తడి ఆరిపోతుందనే రిపోర్టులు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. లక్షల మందికి మంచి నీరు అందించే గుజరాత్ లోని సర్దార్ సరోవర్ రిజర్వాయర్, మధ్యప్రదేశ్ లోని ఇందిరా సాగర్ డ్యామ్ లు ఎండిపోయే పరిస్ధితులు ఏర్పడున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా మహా నగరాల్లో మంచినీటి నిల్వలు పడిపోతున్నాయి. 2030 నాటికి డిమాండ్‌ – సరఫరా మధ్య 40 శాతం వ్యత్యాసం ఉంటుందని ఇటీవల ఐక్యరాజ్యసమితి తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో నీటినిల్వలపై అధ్యయనం చేసి, అత్యంత వేగంగా తాగునీటి నిల్వలు పడిపోతున్న మొదటి 11 నగరాల జాబితాను ఐక్యరాజ్యసమితి విడుదల చేసింది. ఈ లిస్ట్ లో బ్రెజిల్ ఆర్థిక రాజధాని సావోపోలో మొదటిస్థానంలో ఉండగా, భారత ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, జనాభా విచ్చలవిడిగా పెరిగిపోవడం, నీటి నిర్వహణ లోపాలే ఇందుకు ప్రధాన కారణమని ఆ నివేదికలో తెలిపింది. ఐరాస నివేదిక ప్రకారం వివిధ నగరాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి.

బ్రెజిల్ లో అత్యంత దారుణం :
బ్రెజిల్ ఆర్థిక రాజధాని సావోపోలో మూడేళ్లుగా తాగునీటి తిప్పలు ఉన్నాయి. గత ఏడాది రిజర్వాయర్లలో నీటి నిల్వలు 15 శాతం పడిపోయాయి. కొన్ని వారాలు మాత్రమే నీరందించగలిగే పరిస్థితి ఎదురైంది. ఈ ఏడాది సైతం ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.

బెంగళూరు సెకండ్ ప్లేస్ :
ప్రపంచ వ్యాప్తంగా మంచినీటి కష్టాలు ఎదుర్కొనే మహా నగరాల్లో బెంగళూరుది సెకండ్ ప్లేస్. నీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థ సరిగా లేకపోవడంతో వృథా అవుతున్నది. బెంగళూరులోని ఏ ఒక్క చెరువులోని నీరు కూడా కనీసం స్నానం చేయడానికి, బట్టలు ఉతుక్కోవడానికి పనికిరావని తేల్చేసింది రిపోర్ట్.

ఇక నీరు అడుగంటుతున్న నగరాల జాబితాలో చైనా రాజధాని బీజింగ్ మూడోస్థానంలో ఉన్నది. ఈజిప్ట్ రాజధాని కైరోకు నాలుగో స్థానంలో నిలిచింది. ఈజిప్ట్ మొత్తం నీటికోసం వందల ఏళ్లగా నైలు నదిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నది. జనాభా పెరిగిపోవడంతో 2025 నాటికి ఈజిఫ్ట్ మొత్తం మంచినీటికి అల్లాడే పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఆ తర్వా తి స్థానాల్లో జకార్తా, మాస్కో, ఇస్తాంబుల్, మెక్సికో సిటీ, లండన్, టోక్యో, మియామీలు ఉన్నాయి.

 

Posted in Uncategorized

Latest Updates