యువకుడి అరెస్ట్ : రైల్వే స్టేన్ లోనే ముద్దు పెట్టేశాడు

GIRL

ఆకతాయిల ఆగడాలు రోజురోజుకి మితిమీరుతున్నాయి. పబ్లిక్ ప్లేసుల్లోనే రెచ్చిపోతున్నారు. ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే చాలు ఆట బొమ్మలా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ముంబైలో ఓ ఆకతాయి ఇలాగే ప్రవర్తించాడు.  నావీ ముంబైలోని టర్బే రైల్వే స్టేషన్ లో గురువారం (ఫిబ్రవరి-22) ఉదయం  ఓ యువతిని వేధించాడు.

ఫోన్  మాట్లాడుతూ వెళ్తున్న ఓ యువతి వెనకాలే వెళ్లిన ఆ వ్యక్తి… ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బలవంతంగా ముద్దు పెట్టేశాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.  ఆ వ్యక్తి తనను స్టేషన్  బయటి నుంచే ఫాలో అయ్యాడని యువతి చెబుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న RPF పోలీసులు .. కొద్దిసేపటి తర్వాత నరేష్  జోషి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates