యువకులు కనిపిస్తే చాలు.. ఎత్తుకెళ్లి పెళ్లి చేస్తారు

pakadua_vivah_bihar_1517744325పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. బీహార్ లో కుర్రాళ్లకు మాత్రం పెళ్లి నూరేళ్ల మంటలా తయారైంది. ఎక్కడైనా మగపిలగాళ్లు పెళ్లంటే ఎగిరి గంతేస్తారు. బీహార్ లో మాత్రం… వయసొచ్చిన కుర్రాళ్లు గుక్కపట్టి ఏడుస్తున్నారు. ఎందుకో తెలుసా పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి.. కత్తులను కుతికల దగ్గర పెట్టి.. ఇష్టం లేకపోయినా సరే చచ్చినట్టు తాళికట్టిస్తున్నారక్కడ. అదే పకుడా వివాహ్. రీసెంట్ గా ఓ ఇంజనీరింగ్ కుర్రాడు తన బలవంతపు పెళ్లి గురించి చెప్తే.. అవాక్కయ్యారంతా. ఇంతకీ ఏంటి పకడువా వివాహ్. పెళ్లి.. యువతను గాల్లో తేలి.. ఊహల్లో విహరించేలా చేసే మెమరబుల్ ఈవెంట్. లైఫ్ లో ఒక్కసారే వచ్చే మధుర ఘట్టం. పెళ్లి కొందరికి అచ్చొస్తే… మరికొందరి జీవితాల్లో కల్లోలం సృష్టిస్తోంది. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయంటారు. కానీ బీహార్ లో మాత్రం అమ్మాయి తరఫువాళ్లు నిర్ణయిస్తారు. దీన్నే పకడువా వివాహ్ అంటున్నారు.

పకడువా వివాహ్ అంటే ఏం లేదు.. వరుడ్ని ఎత్తుకెళ్లి బలవంతంగా పెళ్లి చేయటం అంతే. పురాణాల్లో మహిళలను ఎత్తుకెళ్లి చేసే పెళ్లిళ్లను రాక్షస వివాహం అనేవారు. బీహార్ లో పకడువా వివాహ్ అంటున్నారు. రీసెంట్ గా ఓ 29 ఏళ్ల ఇంజనీరింగ్ కుర్రాడు తనకు జరిగిన బలవంతపు పెళ్లి గురించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో పకడువా వివాహ్ గురించి దేశం మొత్తానికి తెలిసొచ్చిందన్నమాట. వరకట్నం గురించి మనకు తెలిసిందే కదా. కూతురు అత్తారింటికి వెళ్లాక ఏ కష్టం రానివ్వకుండా.. వియ్యంకులకు వీలైనంత ఇచ్చుకుంటుంటారు. కొంతమంది ఆస్తులమ్మి మరీ ఆడపిల్లల పెళ్లిళ్లు చేస్తుంటారు. బీహార్ లోనూ అలాంటి బీమారుంది. కానీ అక్కడ అమ్మాయిల తల్లిదండ్రులు కొంచెం డిఫరెంట్ గా ఆలోచించారు. అడిగినంత కట్నాలిచ్చుకోలేక.. వరుడిని ఎత్తుకొచ్చి మరీ తమ కూతుళ్లకిచ్చి పెళ్లిచేస్తున్నారు. అది కూడా పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి. తాళి కడతావా ? చస్తావా ? నో ఆప్షన్. అని బెదిరించి మరీ. ఈ సీన్ చూడండి.

బీహార్ లో 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న కుర్రాళ్లకు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ లా మారిందీ బలవంతపు పెళ్లిళ్ల తంతు. హ్యాండ్సమ్ గా ఉండి.. కాస్తో కూస్తో చదువుకుని ఉంటే చాలు. ఇక ఉద్యోగం చేస్తూ ప్రయోజకుడనిపించుకుంటే అంతే సంగతులు. ఎత్తుకెళ్లిపోవటమే. పెళ్లి చేయడానికి ముందు కూతురి ఇష్టాఇష్టాలను తెలుసుకుని.. అబ్బాయి నచ్చాడని అమ్మాయి చెప్తే చాలు. ఇక ఆగరట. బంధు-మిత్రుల సలహా తీసుకుని.. పిల్లగాడి గురించి ఆరా తీసి మరీ కిడ్నాప్ చేస్తున్నారట. కొన్ని సందర్భాల్లో రౌడీల హెల్ప్ తీసుకుంటుండటం ఇక్కడ ట్విస్ట్. బలవంతపు పెళ్లే కదా ? వరుడు ఇష్టం లేని పెళ్లాంతో కాపురం చేస్తాడా అన్న డౌట్ రావొచ్చు. కానీ అలా కుదరదట. కాపురం చేయట్లేదని తెలిస్తే చాలు.. అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు వెళ్లి రచ్చ చేస్తున్నారట. కొంతమంది అమ్మాయిలైతే తల్లిదండ్రులు చేసిన తప్పుకు.. తన మొగుడేం చేస్తాడని ఓర్చుకుంటున్నారట. మరికొందరేమో భర్త ఏదో ఒకరోజు మారి తనను ఆదరించకపోతాడా అని ఎదురుచూస్తున్నారట.

ఇక అబ్బాయిలది మరో వెర్షన్. ఎంత పెళ్లైతే మాత్రం.. ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఎలా కాపురం చేస్తామంటున్నారు. ఆత్మాభిమానం ఉంటుంది కదా అన్నది వాళ్ల క్వశ్చన్. తన్ని బలవంతంగా పెళ్లి చేస్తే ఎలా కాపురం చేస్తామంటున్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం 2017లో బీహార్లో 3వేల 405 మంది కుర్రాళ్లకు బలవంతపు పెళ్లిళ్లు జరిగినట్టు తేలింది. 2016లో 3 వేల 70, 2015లో 3 వేలు, 2014లో 2 వేల 526 బలవంతపు పెళ్లిళ్లు జరిగినట్లు గుర్తించారు. ఇప్పటివరకు జరిగిన బలవంతపు పెళ్లిళ్లలో 17 శాతం అంటే.. 4 వేలకు పైగా కేసుల్లో కిడ్నాప్ చేసి జరిపినవేనని గుర్తించారు. బలవంతపు పెళ్లిళ్లపై బీహార్ లో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. దాంతో కిడ్నాపులు ఆపేందుకు పోలీసులు యాక్షన్ తీస్కుంటున్నారు. మనదగ్గరే కాదు. బీహార్ లోనూ ఇపుడు పెళ్లిళ్ల సీజనే. 18 నుంచి 30 ఏళ్లలోపున్న యువతను కాపాడటం.. తలకు మించిన భారంగా మారిందంటున్నారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates