యువతకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది: మోడీ

MODIదేశాభివృద్ధిలో యువత కీలకమన్నారు ప్రధాని నరేంద్రమోడీ. వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపడుతోందన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి యువ వ్యాపారవేత్తలు హాజరయ్యారు. వారిని ఉద్దేశించి మాట్లాడారు మోడీ. నేటి యువతరం ఉద్యోగ సృష్టి కర్తలుగా మారుతున్నారన్నారు. స్టార్టప్‌లు పెద్ద పెద్ద నగరాలకే పరిమితం కాదని..దేశమంతటా విస్తరిస్తున్నాయన్నారు.

చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల్లోనూ ఇప్పడు స్టార్టప్‌ కంపెనీలు ప్రారంభమవుతున్నాయన్నారు ప్రధాని మోడీ. వ్యాపారానికి అవసరమైన నిధులు, చేయగలమన్న ధైర్యం, ప్రజలతో కలిపోయే తీరు స్టార్టప్‌లలో రాణించేందుకు  సహాయపడుతాయన్నారు. మేకిన్‌ ఇండియా, డిజిల్‌ ఇండియా కూడా స్టార్టప్‌లకు ముఖ్యమేనన్నారు.

ఒకప్పుడు స్టార్టప్‌ కంపెనీలు అంటే డిజిటల్‌, టెక్నాలజీకి సంబంధించినవే ఉండేవన్నారు. కానీ ఇప్పుడు అది మారుతోందని… వ్యవసాయం దగ్గర నుంచి అన్ని రంగాల్లోనూ స్టార్టప్‌లు వస్తున్నాయన్నారు. యువత వ్యాపారాల్లోకి వచ్చేందుకు ప్రభుత్వం అని విధాలా సాయం చేస్తోందన్నారు. నిబంధనలను కూడా సరళించి స్టార్టప్‌లకు నిధులు అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ ఒకప్పుడు స్టార్టప్‌లేనన్నారు. స్టార్టప్ కంపెనీల కోసం ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ కింద రూ.10 వేల కోట్లను ఇవ్వనున్నట్లు తెలిపారు ప్రధాని మోడీ.

 

Posted in Uncategorized

Latest Updates