యువతకు సివిల్స్ టాపర్స్ స్ఫూర్తి : స్వామి గౌడ్

TOPPERS CIVILయువత సివిల్స్ టాపర్స్‌ని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది సివిల్స్ సాధించాలన్నారు శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్. సోమవారం (మే-21) హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్ టాపర్స్‌తో పోటీ పరీక్షలకు హాజరయే అభ్యర్థులకు ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా.. తెలంగాణ గర్వంగా తలెత్తుకునేలా చేసిన సివిల్స్ ర్యాంకర్లకు శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అభినందనలు తెలియజేశారు.

సివిల్స్ టాపర్స్‌ని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది సివిల్స్ సాధించాలని సూచించారు. రాష్ట్రం గర్వపడేలా సివిల్స్ ర్యాంకర్లు సంక్షేమ పథకాలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో అత్యంత అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. సివిల్స్ ర్యాంకర్లు కాబోయే అధికారులంటూ శానసమండలి స్వామిగౌడ్ వారిని కుర్చీలో కూర్చోబెట్టి గౌరవించారు. సివిల్స్ ర్యాంకర్లు ముందు కూర్చోగా..స్పీకర్ మధుసూదనాచారి, చైర్మన్ స్వామిగౌడ్, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఆయాచితం శ్రీధర్, బీసీ కమిషన్ సభ్యులు, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం తదితరులు వారి వెనకవైపు నిలబడి అరుదైన గౌరవాన్ని అందించారు.

Posted in Uncategorized

Latest Updates