యువరాజ్ ఫన్నీ ట్వీట్ : నీ మెడను మళ్లీ ఇలాగే పట్టుకుంటా

 బుధవారం యవరాజ్ తన 37 వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఇందుకుగాను టీమిండియా సభ్యులతో పాటు పలువురు యూవీ కి బర్త్ డే విషెస్ తెలిపారు. ఇందులో భాగంగా … టీమిండియా బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ కూడా శుభాకాంక్షలు తెలిపారు. “శాశ్వత సూపర్ స్టార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు” అని రోహిత్ ట్వీట్ చేశారు. అందుకుగాను ఓ ఫొటోను తన పోస్ట్ లో జతపరిచారు. ఆ ఫొటో లో రోహిత్ మెడను యువరాజ్ పట్టుకున్నట్లుగా ఉంది. దీంతో..  యువ రాజ్ కూడా ఫన్నీగా బదులిచ్చాడు. “నీవు 37వ పుట్టిన రోజు జరుపుకున్నప్పుడు నేను మళ్లీ ఇలాగే నీ మెడను పట్టుకుంటా” అని యువరాజ్ సరదాగ బదులిచ్చాడు.

Posted in Uncategorized

Latest Updates