యువర్ టైమ్ ఆన్ : ఫేస్ బుక్ లో కొత్త టూల్

FBNగంటల తరబడి ఫేసుబుక్ లో గడుపుతున్నారా? పక్కన ఏం జరుతుందో సంబంధం లేకుండా ఫేస్ బుక్ కు బానిసైపోతున్నారా? రోజులో ఎంత సమయం ఫేస్ బక్ లో గడుపుతున్నారో తెలియనంతగా ఫేస్ బుక్ లో గడుపుతున్నారా? ఫేస్ బుక్ నుంచి బయటకు రాలేకపోతున్నారా? ఇలాంటి వాళ్ల కోసం యువర్ టైమ్ ఆన్ ఫేస్‌బుక్ పేరుతో కొత్త టూల్ ని అందుబాటులోకి తీసుకొస్తుంది ఫేస్ బుక్. ఈ కొత్త టూల్ ద్వారా గత వారం రోజుల్లో మనం  సగటున రోజుకి ఫేస్ బుక్ లో సమయం గడిపారో తెలుసుకోవచ్చు. దీనికోసం మన ఫేస్ బుక్ లో ముందుగానే టైమ్ సెట్‌ చేసుకుంటే నిర్ణీత సమయం కాగానే మనల్ని అలెర్ట్ చేస్తుంది. త్వరలోనే ఆండ్రాయిడ్ తో పాటుగా ఇతర ఫోన్లకు కూడా ఈ టూల్ అందుబాటులోకి రానుంది. ఈ టూల్ ద్వారా ఫేస్‌బుక్‌ కు యువత బానిస కావడం తగ్గుతుందని ఫేస్ బుక్ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే యూజర్లకు తమ ఫోన్లపై నియంత్రణ కలిగి ఉండేందుకు గూగుల్, యాపిల్‌ సంస్ధలు టైమ్ ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్‌ ని అందుబాటులోకి తెచ్చింది.

Posted in Uncategorized

Latest Updates