యూఎన్ఓ రాయబారిగా ఇవాంకా బెస్ట్ ఛాయిస్ : డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్ : యూఎస్ఏ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన స్టేట్ మెంట్ తో ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్నారు. యూఎన్ఓలో అమెరికా రాయబారి పదవికి రాజీనామా చేసిన నిక్కీ హేలీ స్థానంలో.. తన కూతురు ఇవాంకా ట్రంప్ ను రీప్లేస్ చేస్తే బాగుంటుందనిపిస్తోందని అన్నారు. తన కూతురు అనే ఉద్దేశంతో ఈ మాట చెప్పడం లేదని… ఆ పదవికి ఇవాంక బెస్ట్ ఛాయిస్ అని అభిప్రాయపడ్డారు. “ఇవాంక చాలా తెలివిగల అమ్మాయి. సమయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. ఆమె తెలివితేటలు, పనితనం ప్రజలకు మరింతగా వివరించేందుకే నా అభిప్రాయం చెబుతున్నా” అని వైట్ హౌజ్ లో ఓ మీటింగ్ లో ఉన్నారు.

నిక్కీ హేలీ రాజీనామా చేసిన తర్వాత… ట్రంప్ ఈ కామెంట్స్ చేయడంతో..ఆ పదవిలో ఇవాంకను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఐతే.. ఈ వార్తలను ఇవాంక ట్రంప్.. ట్విట్టర్ లో తప్పుపట్టారు. యూఎన్ఓ అంబాసిడర్ గా తగిన వ్యక్తినే ప్రెసిడెంట్ నియమిస్తారని.. అది తాను కాదని అన్నారు. వైట్ హౌజ్ లో గొప్పవాళ్ల మధ్య పనిచేయడం గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. ఇవాంక, ఆమె భర్త జేర్డ్‌ కుష్నర్‌ .. ఇప్పటికే వైట్‌హౌస్‌ లో హైలెవెల్ అడ్వైజర్స్ గా ఉన్నారు.

యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో అమెరికా రాయబారి పదవికి నిక్కీ హేలీ మంగళవారం రాజీనామా చేశారు. డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ రాజీనామాను ఆమోదించారు. ఇండో అమెరికన్ అయిన నిక్కీ హేలీ…. 2016 నవంబర్‌లో యూఎన్ఓకు అమెరికా అంబాసిడర్ గా నియమితులయ్యారు. అమెరికా ప్రభుత్వంలో కేబినెట్ స్థాయి పదవి దక్కించుకున్న మొదటి ఇండో అమెరికన్‌ గా నిక్కీ పేరు చరిత్రకెక్కింది.

Posted in Uncategorized

Latest Updates