యూఎస్ సుప్రీం జడ్జిగా కావెనా…పంతం నెగ్గించుకున్న ట్రంప్

అమెరికా సుప్రీంకోర్టు జడ్జీగా బ్రెట్ కావెనా నామినేషన్ ను సెనేట్ ఆమోదించింది. ఆదివారం జరిగిన ఓటింగ్ లో కావెనాకు అనుకూలంగా 50 మంది, వ్యతిరేకంగా 48 మంది సెనేటర్లు ఓటేశారు. దీంతో కావెనా సుప్రీం జడ్జిగా ఎన్నికయ్యారు. రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కావెనాను ప్రెసిడెంట్ ట్రంప్ సుప్రీం జడ్జీగా నామినేట్ చేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. సెనేట్ లో ఓటింగ్ జరుగుతున్న సమయంలో ఒయట “షేమ్ షేమ్ “ అన్న అరుపులు మిన్నంటాయి. కావెనాపై వచ్చిన ఆరోపణలపై ఎఫ్ బీఐ విచారణ జరిపిందని సమాచారం.
సుప్రీం జడ్జిగా కావెనా నామినేషన్ ను సెనేట్ ఆమోదించడంతో చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. సెనేట్ ఆమోదంతో ట్రంప్ తన పంతాన్ని నెగ్గించుకున్నట్లైంది.

Posted in Uncategorized

Latest Updates