యూకేలో భారత సంతతి యువతికి గ్లోబల్‌ గోల్స్‌ అవార్డు

యూకేలో నివసిస్తున్న భారత సంతతి యువతి అమికా జార్జ్‌(18)కి అరుదైన గౌరవం దక్కింది. సామాజిక సేవ విభాగానికి గానూ ఆమెకు గ్లోబల్‌ గోల్స్‌ అవార్డు దక్కించుకుంది. అమికా జార్జ్‌ పుట్టింది… పెరిగింది యూకేలోనే. ఆమె పూర్వికులది మాత్రం కేరళ. యూకేలో ఆడపిల్లలు స్కూలుకి రాకపోవడానికి నెలసరి సమయాల్లో వారికి సరైన శానిటరీ నాప్‌కిన్స్‌ అందుబాటులో ఉండటం లేదని తెలుసుకున్న అమికా చలించిపోయింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో #ఫ్రీ పీరియడ్స్‌ కాంపెయిన్‌ పేరుతో పెద్ద స్థాయిలో ఉద్యమం చేసింది. యూకేలో ఉన్న పేద ఆడపిల్లలకు నెలసరి సమయాల్లో ఎదురయ్యే ఇబ్బందుల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. నిరుపేద యువతులకు ఫ్రీగా శానిటరీ నాప్‌కిన్స్‌ సరఫరా చేయాలని అమికా విస్తృత స్థాయిలో ప్రచారం చేసింది.

అంతేకాదు తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఉచితంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సరఫరా చేయాలని డిమాండ్‌ చేసింది. ఈమె పోరాటానికి బిర్లా అండ్ మిలిందా ఫౌండేషన్‌ సహకారం లభించడంతో ప్రభుత్వం దిగి వచ్చి యూకేలోని పేదయువతులకు శానిటరీ నాప్‌కిన్స్‌ ఫ్రీగా అందించడానికి ముందుకు వచ్చింది. వీటన్నింటికి గానూ అమికా సామాజిక ప్రగతి ఆస్కార్‌ అవార్డు గెలుచుకుంది.

Posted in Uncategorized

Latest Updates