యూజర్లకు ఎయిర్ టెల్ వెసులుబాటు

airtelఅతిపెద్ద టెలికం సంస్థ ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్‌ను సవరించింది. ఇప్పటి వరకు ఈ ప్లాన్‌లో రోజుకు 1.4జీబీ డేటా అందిస్తుండగా దాన్ని 2.4జీబీకి పెంచింది. అయితే ఈ ప్లాన్‌లో ఉన్న ఖాతాదారుందరికీ ఇది వర్తించదు. ఎంపిక చేసిన వారికి మాత్రమే ఈ అదనపు డేటా లభిస్తుంది. ఇదే ప్లాన్‌లో కొందరు యూజర్లకు 70 రోజుల కాలపరిమితి లభిస్తుండగా, మరికొందరికి 84 రోజుల కాలపరిమితి లభిస్తోంది. అదనంగా అందిస్తున్న 1జీబీ డేటా 84 రోజుల కాలపరిమితి ఉన్న ఖాతాదారులకు మాత్రమే లభిస్తుందని తెలిపింది ఎయిర్‌టెల్. అంటే, రూ.399 ప్లాన్‌లో 84 రోజుల కాలపరిమితి ఉన్న వినియోగదారులకు ఇకపై రోజుకు 2.4 జీబీ డేటా లభిస్తుంది. అలాగే రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. త్వరలోనే ఈ ఆఫర్‌ను అందరికీ వర్తింపజేయలని యోచిస్తోంది ఎయిర్ టెల్.

Posted in Uncategorized

Latest Updates