యూటర్న్ లో సమంత చక్కర్లు

636546610214445466అక్కినేని కోడలు సమంత నటిస్తున్న సినిమా యూ టర్న్. ఈ మూవీ షూటింగ్ రాజమహేంద్రవరంలో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో భాగంగా సమంత రాజమహేంద్రవరంలో స్కూటీపై షికార్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యూ టర్న్ కు రీమేక్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. సేమ్ డైరెక్టర్ పవన్ కుమారే షూట్ చేస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సమంత నటించిన రంగస్థలం మూవీ షూటింగ్ కూడా రాజమహేంద్రవరంలో జరిగింది. ఇక్కడి వాతావరణం తనకు చాలా బాగా నచ్చినట్లు సమంత చెప్పిన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates