యూట్యూబ్ లో V6 న్యూస్ మరో సంచలనం : 20 లక్షల మంది సబ్ స్క్రైబర్స్

v6-2million

Youtubuలో తెలుగు న్యూస్ లో నెంబర్ వన్ ఛానల్ గా ఉన్న వి6 న్యూస్ మరో మైలురాయిని అందుకుంది. ఆరేళ్ల క్రితం డిజిటల్ లో మొదలైన అడుగు.. 2 మిలియన్స్.. 20 లక్షల మంది సభ్యులతో ఆదరాభిమానాలు నిలబెట్టుకుంటోంది. న్యూసెన్స్, నాన్సెన్స్ లేకుండా  ఎప్పటికప్పుడు మంచి న్యూస్ కంటెంట్ తో యూట్యూబ్  ప్రేక్షకుల ఆదరణ సంపాదించింది. జనం భాషలో వార్తలివ్వడం, వార్తలను వార్తలుగా ఇవ్వడం వల్లే నెటిజన్ ప్రేక్షకుల ఆదరణ దక్కిందని వీ6 నమ్ముతోంది. తెలంగాణ ప్రజల వార్తలకు, సంస్కృతి, సంప్రదాయాలకు పట్టంగట్టడంతో పాటు ఊరి బతుకులు, సామాజిక సమస్యలపై కథనాలతో అన్ని వర్గాలకు దగ్గరైంది. తెలంగాణ ఉద్యమం మైలురాళ్ల నుంచి, ప్రత్యేక రాష్ట్ర బిల్లు పాసయ్యే వరకు, తెలంగాణ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ప్రతి సందర్భంలోనూ జనం ఆదరణతో వీ6 యూట్యూబ్ చానెల్ రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది.

93వేలకు పైగా వార్తలు, కథనాల వీడియోలు వీ6 యూట్యూబ్ ఛానల్ లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి రోజూ లక్షల మంది వీక్షిస్తూ ఉన్నారు. రెండేళ్ల కిందే 10 లక్షల మంది సభ్యుల మైలురాయి అందుకొని యూట్యూబ్ లో తెలుగు న్యూస్ చానెళ్లలో రికార్డు సృష్టించింది. మరో ఏడాది కాలంలోనే 15 లక్షల సబ్ స్కైబర్స్ కు చేరుకొని, మళ్లీ ఆరునెలల కాలంలోనే 20 లక్షలను అందుకోవడం విశేషం. కొత్తతరం న్యూస్ ప్లాట్ ఫాంలను అందుకోవడంలో, ఉపయోగించుకోవడంలో తెలుగు ప్రేక్షకుల ఆసక్తికి, సత్తాకు వీ6 యూట్యూబ్ చానెల్ నిదర్శనంగా నిలిచింది. ఈ మైలురాయిని చేరుకోవటంతోపాటు.. V6 తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వేగంగా ఎదుగుతున్న యూట్యూబ్ న్యూస్ చానెల్ ల్లో V6NEWS ఒకటిగా ప్రత్యేకత సాధించింది. వినోదం, సినిమా చానెళ్లకు దీటుగా వార్తలకు పట్టంగట్టిన ప్రేక్షకులకు వీ6 ధన్యావాదాలు చెబుతోంది. ఇదే అదరణ కొనసాగాలని ఆకాంక్షిస్తూ… ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హామీ ఇస్తోంది.

Posted in Uncategorized

Latest Updates