యూత్ కు టాలెంట్ తో పాటు అన్నీ సౌకర్యాలున్నాయి : గవర్నర్

govసోషల్ మీడియాలో  వచ్చే ఫేక్ న్యూస్  కంట్రోల్ చేసేందుకు  ప్రయత్నించాలన్నారు  గవర్నర్ నరసింహన్. సికింద్రాబాద్ తిరుమలగిరిలోని  మిలిటరీ కాలేజ్  ఆఫ్ ఎలక్ట్రానిక్స్  అండ్ మెకానికల్  ఇంజనీరింగ్  కాన్వకేషన్ కు  హాజరయ్యారు నరసింహన్.  ఆర్మీకి అవసరమైన  టెక్నాలజీతో పాటు  కామన్ మాన్ కు  అవసరమయ్యే సదుపాయాలు కల్పించేలా  కృషి చేయాలని  అధికారులకు సూచించారు. భారత్ లో  యువతకు టాలెంట్ తో పాటు కావాల్సిన  అన్ని సౌకర్యాలున్నాయని… వీటిని  సద్వినియోగం  చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గాలితో పవర్ జనరేట్  చేసిన ఆర్మీ అధికారులకు  బెస్ట్  ప్రాజెక్టు  అవార్డులు ఇచ్చారు గవర్నర్.

Posted in Uncategorized

Latest Updates