యూనిఫైడ్ డిజైన్లతో కొత్త ఫుట్ పాత్ లు : కేటీఆర్

KTRహైదరాబాద్ లో కొత్తగా నిర్మించే ఫుట్‌ పాత్‌ లను అత్యున్నత ప్రమాణాలు, యూనిఫైడ్ డిజైన్లతో సాధ్యమైనంత మేరకు అన్ని సౌకర్యాలు ఉండేలా నిర్మించాలని తెలిపారు మంత్రి కేటీఆర్. GHMC చేపట్టిన ఫుట్‌ పాత్‌ ల ఆక్రమణల తొలగింపుపై కేటీఆర్ ఉన్న‌తాధికారుల‌తో సమీక్ష నిర్వహించారు.

ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఆక్రమణల తొలగింపులో వీధి వ్యాపారులను దృష్టిలో పెట్టుకొని సున్నితంగా వ్యవహరించాలన్న ఆయన.. నగరంలో నిర్ణీత వెండింగ్ జోన్లతో కూడిన ఒక యాప్ తయారు చేయాలన్నారు. త్వరలోనే వీధి వ్యాపారులతో సంబంధిత అధికారులు సమావేశం కావాలని.. ఆక్రమణల తొలగింపు తరువాత వెంటనే ఫుట్‌ పాత్‌ ల నిర్మాణాన్ని ప్రారంభించాలని తెలిపారు. నూతనంగా నిర్మించే ఫుట్‌ పాత్‌ లకు జోనల్ కమిషనర్లు ప్రత్యేక బాధ్యత వహించాలని.. పదేపదే ఆక్రమణలకు పాల్పడ్డ షాపు యాజమానుల ట్రేడ్ లైసెన్సుల రద్దుకు అవకాశాలు పరిశీలించాలన్నారు. ఫుట్‌ పాత్‌ లపై ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ ఫార్మర్లు, ఇతర నిర్మాణాల విషయంలో ట్రాన్స్‌ కోతో పాటు, ఇతర ప్రైవేట్ ఏజెన్సీలకు నోటీసులివ్వాలని తెలిపారు. నగరంలో నిర్మించే ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్ పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకొని మూడు నెలల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు మంత్రి కేటీఆర్.

 

 

 

Posted in Uncategorized

Latest Updates