యూనివర్సిటీలకు రూ. 420 కోట్లు : కడియం

kadiyamయూనివర్సిటీల్లో వెయ్యి అరవై ఒకటి పోస్టులకు అనుమతిచ్చామన్నారు మంత్రి కడియం శ్రీహరి. బుధవారం (మార్చి-28) అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన కడియం..పేద విద్యార్థుల విదేశాల్లో చదువుకునేందుకు రూ.20 లక్షల సాయం అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపోతం చేస్తున్నామని తెలిపిన కడియం..ప్రైవేటు యూనివర్సిటీల పై ప్రతిపక్షాలు అపోహలు చేస్తున్నాయన్నారు.

మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని..విద్యా విషయంలో ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీలను తెలంగాణ విద్యార్థులకు కల్పిస్తామన్నారు కడియం. ప్రభుత్వ యునివర్సిటీలను అభివృద్ధి పరుస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు యూనివర్సిటీలకు రెడ్ కార్పెట్ పరచబోమని స్పష్టం చేశారు.  యూనివర్సిటీల్లో వెయ్యి అరవై ఒకటి ఉద్యోగాల నోటిఫికేషన్ పూర్తి చేస్తామన్న ఆయన..జూన్, జులై నెలల్లో పోస్టుల భర్తీ జరుగుతుందన్నారు.

పోస్టులను భర్తీ చేసేందుకు యూనివర్సిటీలకు అనుమతులు ఇచ్చామని… ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లో మాత్రమే మంజూరైన పోస్టులు ఉన్నాయన్నారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలమూరు యూనివర్సిటీలో 24, మహాత్మాగాంధీ యూనివర్సిటీలో 34, శాతవాహన యూనివర్సిటీలో 40 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చామన్నారు. చాలా యూనివర్సిటీలలో మౌలిక సదుపాయాలు లేవని..  యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఓయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రూ. 420 కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నిధులతో ఆయా యూనివర్సిటీల్లో పనులు జరుగుతున్నాయని తెలిపారు కడియం

Posted in Uncategorized

Latest Updates