యూపీలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి : మోడీ

పాత పద్ధతులు పోయాయి.. ఇప్పుడు రోజులు మారాయన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఉత్తరప్రదేశ్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంత వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. డిజిటల్ మౌలిక వసతులు ఉత్తరప్రదేశ్ ను కొత్త దిశలో తీసుకెళ్తున్నాయన్నారు. ఉత్తరప్రదేశ్ టూర్ లో ఉన్న ఆయన.. ఆదివారం (జూలై-29) 60 వేల కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు లక్నోలో శంకుస్థాపన చేశారు. పేద కుటుంబంలో పుట్టి.. కష్టాలకు ఎదురు నిలిచి.. మంచి ఫలితాలు సాధిస్తున్న విద్యార్థుల గురించి మన్ కీ బాత్ లో మాట్లాడారు ప్రధాని నరేంద్రమోడీ. వీధి దీపాల కింద కూర్చుని చదువుకున్న చిన్నారులు మంచి మార్కులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. అలాగే బస్ డ్రైవర్ లు, కూలీల పిల్లలు కూడా అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని.. వీరిని మిగతా విద్యార్థులు స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు మోడీ.

Posted in Uncategorized

Latest Updates