యూపీలో వ్యతిరేక ఉద్యమం : మాంసం తింటే నరకానికి పోతారంట

NBT-imageనాన్ వెజ్ తినొద్దని పెద్ద ఎత్తున ప్రచారం. వందల మంది కార్యకర్తలతో.. సౌండ్ బాక్సులతో నినాదాలు చేశారు. మాంసం తినడం పాపం.. ఇది మానవ జాతిని నాశనం చేస్తోంది అంటూ గళమెత్తారు మహిళలు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కండివాలి గ్రామంలో జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా పరంసంత్ బాబా జయగురుదేవ్ మహారాజ్ తన అనుచరులతో కలిసి రెండు రోజులుగా ఇలాంటి ర్యాలీలు చేస్తున్నారు. మీరట్ నగర బాబా జయగురుదేవ్ మహారాజ్ తోపాటు వందల మంది అనుచరులు.. మాంసం తినడం సిగ్గుచేటు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలు చేసి సంచలనం రేపారు.

మాంసం మానవత్వాన్ని చంపేస్తోంది.. మాంసం మానండి.. శాకాహారం తినండి అంటూ నినాదాలు చేశారు. నాన్ వెజ్ తింటే నరకానికి పోతారంటూ వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టారు. మాంసం తినేవారికి, మద్యం తాగేవారికి కౌన్సెలింగ్ చేస్తామని శాకాహార ర్యాలీ నిర్వాహకుడు సుశీల్ సింగ్ చెప్పారు. శాకాహార ప్రచార ర్యాలీలకు శ్రీకారం చుట్టిన బాబా అనుచరులు.. మాంసాహారం తినేవారు మారాలంటూ చేసిన ర్యాలీతో చేపలు, కోడిగుడ్లు, మాంసం విక్రయించేవారు ఆందోళన చెందారట. ఇదిలావుంటే ఫుడ్ విషయాల్లో ఎవరి టేస్ట్ వారికుంటుంది.. అలాగని బలవంతంగా మానేస్తే ఆరోగ్యంపాడైతే ఎవరు భరోసా అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు..

Posted in Uncategorized

Latest Updates