యూపీ సంచలన నిర్ణయం : మందు, మాంసం అలవాట్లు లేని పోలీసులకే డ్యూటీ

వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఉత్తరప్రదేశ్‌ లోని అలహాబాద్‌ లో కుంభమేళా ప్రారంభంకానుంది. అయితే ఈ  కుంభమేళాలో డ్యూటీలు చేసే పోలీసుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని చూస్తోంది యూపీ సర్కార్. ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకుంది. కుంభమేళాకు హాజరయ్యే భక్తుల సెంటిమెంట్‌ ను దృష్టిలో పెట్టుకుని శాకాహారులు, మద్యం సేవించని, సిగరెట్‌ తాగే అలవాటు లేని, మర్యాదపూర్వకంగా వ్యవహరించే పోలీసులను డ్యూటీల్లో నియమించాలని అధికారులు నిర్ణయించారు.

కుంభమేళాలో డ్యూటీ చేసే బుద్ధిమంతులైన స్టాఫ్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు ఉన్నతాధికారులు.  సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ఇంటర్వ్యూ చేసి గుడ్ క్యారెక్టర్, అనే సర్టిఫికెట్‌ ఇస్తేనే.. కుంభమేళాలో డ్యూటీలు చేసే అవకాశం పోలీసులకు లభిస్తుంది. షాజహాన్‌ పూర్‌, ఫిలిబిత్‌, బరేలీ, బదౌన్‌ జిల్లాలోని పోలీసుల క్యారెక్టర్లను పరిశీలించాలని జిల్లా SSPలను కోరారు అధికారులు. కుంభమేళా ఎంతో పవిత్రంగా జరుగుతుందని.. ఈ సమయంలో అపవిత్రం చేయకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates