యూసుఫ్ గూడలో దారుణం : బంగారం షాపులో యువతి గొంతుకోసి చంపాడు

mur

హైదరాబాద్ సిటీ నడిబొడ్డున దారుణం. యూసుఫ్ గూడలోని వన్ గ్రాం బంగారం షాపులో యువతిని గొంతుకోసి కిరాతకంగా చంపాడు యువకుడు. ఆమె పేరు వెంకట లక్ష్మి. వయస్సు 19 ఏళ్లు. యూసుఫ్ గూడ ప్రధాన సెంటర్ లో ఉన్న ఈ దుకాణానికి వచ్చింది వెంకటలక్ష్మి. అప్పటికే యువతిని ఫాలో అవుతున్న యువకుడు షాపులోకి వచ్చాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ అమ్మాయి గొంతుకోశాడు. రక్తపు మడుగులో పడిన అమ్మాయి.. అక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన సాయంత్రం 5.15 గంటలకు జరిగింది. ఇది వన్ గ్రామ్ బంగారం షాపు. వస్తువుల కొనుగోలు చేయటానికి వెంకటలక్ష్మి షాపుకి వచ్చింది.

హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనా వస్తున్నారు. హత్య చేసింది ఎవరు అనేది సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆ యువకుడి వివరాలు సేకరిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates