యూ టర్న్ : శ్రీవారి ఆభరణాల ప్రదర్శన లేదు

god venkatesaతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆభరణాల ప్రదర్శన లేదని ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్. మొన్నటి ప్రకటనకు యూటర్న్ తీసుకుంది. పాలక మండలి వెనక్కి తగ్గింది. ఆగమ సలహా మండలి సభ్యులు ఒప్పుకోకపోవటంతోనే వెనక్కి తగ్గినట్లు స్పష్టం చేశారు అధికారులు. శ్రీవారి ఆభరణాలు అత్యంత పవిత్రమైనవి అని.. వాటి విలువను వెల కట్టలేం అన్నారు ఆగమ సలహాదారు సుందరవదన భట్టాచార్య. ఆభరణాలను ప్రదర్శనకు పెడితే భద్రత ఎవరిదని ప్రశ్నించారు. ఆగమ పండితులు కూడా దీన్ని తప్పుబడుతున్నారని వెల్లడించారు. ఆభరణాలు గర్భాలయంలో ఉంటేనే.. భద్రంగా ఉంటాయని తెలిపారు.

మరో సంచలన విషయం కూడా వెల్లడించారు ఆయన. టీటీడీ బోర్డ్ ఏర్పడక ముందే.. శ్రీవారి ఎన్నో అభరణాలు మాయం అయ్యాయని తెలిపారు. పింక్ డైమండ్ ఎప్పుడూ చూడలేదని.. రికార్డుల ప్రకారం అన్ని ఆభరణాలు ఉన్నాయని వివరణ ఇచ్చారు. దశాబ్దాలుగా శ్రీవారి బంగారు, వజ్ర ఆభరణాలకు మరమ్మతులు జరుగుతున్నాయని.. ఇది రొటీన్ గా జరిగే వ్యవహారం అన్నారు ఆగమ శాస్త్ర సలహాదారు సుందరవదన భట్టాచార్య. శ్రీవారి నిత్య సేవలను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయటం నిబంధనలకు విరుద్ధం అని.. శాస్త్రాలను అవమానించటమే అన్నారు.

Posted in Uncategorized

Latest Updates