యోగాసనాలతో ఆకట్టుకున్న విద్యార్థిని

yyయోగాతో గిన్నిస్ రికార్డు సృష్టించేందుకు ప్రయత్నించింది కోయంబత్తూరుకు చెందిన స్టూడెంట్. వేర్వేరు కేటగిరీల్లో యోగా భంగిమలతో రికార్డు కోసం ట్రై చేసింది. హైస్కూల్ విద్యార్థిని వైష్ణవి… నటరాజాసనాన్ని ప్రదర్శించింది. యోగాసనాలు చేస్తూనే కాళ్లతో ఆరు కోడిగుడ్లను కప్పుల్లో ఉంచింది. గడ్డాన్ని నేలకు ఆనించి ఏడు నిమిషాలు ఆసనం వేసింది. అదే సమయంలో వీపు మీదుగా కాళ్లను బెండ్ చేసి తలతో బెలూన్లను పగులగొట్టింది. రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో భారత్ కు ఒలింపిక్స్ పతకం తేవడమే లక్ష్యమంటోంది వైష్ణవి.

Posted in Uncategorized

Latest Updates