యోగా జీవన విధానంలో భాగం కావాలి: మోడీ

manki-baatభారత్-అఫ్గనిస్తాన్ టెస్ట్ మ్యాచ్ ను మన్ కీ బాత్ లో ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోడి. దేశాల మధ్య సత్సంబంధాలకు ఆటలను మించిన వేదికలుండవన్నారు ప్రధాని. అప్గనిస్తాన్ వాడైనా రషీద్ ఖాన్ కోట్లాదిమంది హృదయాలను గెలుచుకున్నాడన్నారు. ఇటీవలే ముగిసిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రస్తావించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్నారన్నారు. ప్రజలు యోగాను తన జీవన విధానంలో భాగం చేసుకోవాలన్నారు…నింగి నేల సముద్రంలో పనిచేసే భద్రతా బలగాలకు యోగా అన్ని విధాల మంచిదన్నారు ప్రధాని మోడీ.

 

Posted in Uncategorized

Latest Updates