యోగా డే: రాందేవ్ బాబా కొత్త వరల్డ్ రికార్డ్

yogaramdevrecordఅంతర్జాతీయ యోగా దినోత్సవం గురువారం(జూన్ -21) యోగా గురు రాందేవ్ బాబా కొత్త గిన్నిస్ రికార్డును సృష్టించారు. ఆయనతో పాటు రాజస్థాన్ సీఎం వసుంధర రాజే, మరో లక్షా 5 వేల మంది కలిసి ఈ రికార్డులో పాలుపంచుకున్నారు. కోటాలోని ఆర్ఏసీ గ్రౌండ్ లో ఒకేసారి ఎక్కువ మంది యోగాసనాలు వేసిన రికార్డును వీళ్లు క్రియేట్ చేశారు. గతేడాది కూడా ఇంటర్నేషనల్ యోగా డే రోజు పతంజలి కొన్ని వరల్డ్ రికార్డులను క్రియేట్ చేసింది. 51 గంటల పాటు మారథాన్ యోగా చేయడం, పతంజలి యోగ్ పీఠ్ వలంటీర్లు జైపాల్, గోపాల్, మోహన్ శంకర్‌లు కలిసి అత్యధిక సమయం పాటు శీర్షాసనసం వేయడంలాంటి రికార్డులు సృష్టించారు.

గతేడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మైసూర్‌లో ఒకేసారి ఏకంగా 55,506 మంది యోగాసనాలు వేశారు.ఈ ఏడాది ఆ రికార్డును బ్రేక్ చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates