యోగా సాధ‌న‌తో శాంతి సంతోషాలు: ప్రధాని మోడీ

modiయోగా సాధనతో శాంతి, ఆరోగ్యం, సంతోషం కలుగుతాయన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ప్రజలతో కలిసి ఆయన యోగాసనాలు చేశారు. ఉత్తరాఖండ్‌ అనేక దశాబ్దాలుగా యోగా, ఆయుర్వేదిక్‌కు ముఖ్య కేంద్రంగా ఉందన్నారు. యోగా.. కుటుంబం, సమాజంలో సద్భావన కలిగిస్తుందన్నారు. డెహ్రాడూన్‌ నుంచి డబ్లిన్‌ వరకు, షాంఘై నుంచి షికాగో వరకు అన్ని దేశాల ప్రజలు యోగాలో నిమగ్నమయ్యారని తెలిపారు. అతి తక్కువ సమయంలోనే యోగా ప్రపంచవ్యాప్తమయ్యిందన్నారు ప్రధాని మోడీ.

 

Posted in Uncategorized

Latest Updates