యోగి మరో నిర్ణయం: ప్రయాగ్‌రాజ్‌ గా…అలహాబాద్

ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది కుంభమేళా జరగనున్న క్రమంలో త్వరలోనే అలహాబాద్ జిల్లాను ప్రయాగ్‌రాజ్‌గా మార్చనున్నట్లు ప్రకటించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. అలహాబాద్‌లో కుంభమేళా ఏర్పాట్లపై సమీక్షించారు. ఇందులో భాగంగా అలహాబాద్ జిల్లా పేరును మార్చాలని అఖాఢ పరిషద్‌తో పాటు మరి కొంతమంది ఇలాంటి ప్రతిపాదనే చేశారు. యూపీ గవర్నర్ రామ్ నాయక్ కూడా పేరు మార్పుపై సానుకూలంగానే స్పందిస్తూ ఆయన తన నిర్ణయాన్ని తెలిపారు. మార్పు ప్రతిపాదనకు మద్దతు తెలిపామని…మరికొద్ది రోజుల్లో అలహాబాద్ జిల్లా పేరును అధికారికంగా ప్రయాగ్‌రాజ్‌గా మారుస్తూ ప్రకటన విడుదల చేస్తామని ఆదిత్యానాథ్ తెలిపారు. వచ్చే కేబినెట్ మీటింగ్‌లో ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలుపుతుందని రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates