రంగస్థలం ఫస్ట్ సాంగ్ : ఎంత సక్కగున్నావే రామలక్ష్మీ

saiమెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, సమంత హీరో,హీరోయిన్‌లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రంగస్థలం’. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన రెండు టీజర్స్‌కి ఇప్పటికే అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన ‘ఎంత సక్కగున్నావే రామలక్ష్మీ’ అనే సాంగ్ ని ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేసింది సినిమా యూనిట్. చంద్రబోస్ రాసిన ఈ పాటను మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్ స్వయంగా పాడారు. క్యాచీ లిరిక్స్‌తో దేవిశ్రీ వాయిస్‌లో ఈ సాంగ్ అద్భుతంగా ఉంది. ప్రేమికుల రోజు(ఫిబ్రవరి14) కానుకగా విడుదలైన ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటూ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది.

Posted in Uncategorized

Latest Updates