రంగస్థలం విజయం..ఉపాసన కాలినడక

upasana ttdసుకుమార్ డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం హిట్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా సక్సెస్ తో ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తుండగా..అంతకు రెట్టింపు సంతోషంతో ఉన్నానని చెబుతోంది చెర్రీ భార్య ఉపాసన. రంగస్థలం సినిమా విజయం సాధించడంతో ఉపాసన తిరుమల వేంకటేశ్వర స్వామిని కాలినడకన వెళ్లి దర్శించుకున్నారు. గురువారం (ఏప్రిల్-12)సాయంత్రం అలిపిరి నుంచి కాలినడకను ప్రారంభిస్తున్న ఫొటోలను ట్విట్ చేసింది ఉపాసన. బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించిన రంగస్థలం సినిమా భారీ వసూళ్లను రాబడుతోన్న విషయం తెలిసిందే. సినిమాలో చెవిటి వ్యక్తి పాత్రలో రామ్‌ చరణ్‌ ఒదిగిపోయిన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates