రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

road-accidentరంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లి దగ్గర ఆదివారం(జూన్-25) ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొనడంతో ఐదుగురుమహిళలు చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బండలేమూరుకు చెందిన మహిళలు కూరగాయాలు అమ్మేందుకు ఆటోలో ఇబ్రహీంపట్నం వెళుతుండగా … ప్రమాదం జరిగింది. కారు వేగంగా రావడం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం హైదరాబాద్ కి తరలించారు.

Posted in Uncategorized

Latest Updates