రంగు గుర్తుపెట్టుకోండి : కొత్త రూ.100 నోటు ఇలా ఉంటుంది

కొత్త కలర్ లో.. కొత్త 100 నోటు ప్రింటింగ్ ప్రారంభించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కొత్త నోటు ఎలా ఉంటుందో ఫొటోలు విడుదల చేసింది. 142 మిల్లీమీటర్ల పొడవు, 66 మిల్లీమీటర్ల వెడల్పుతో సైజు ఉంది. వంకాయ కలర్ లో ది. (పర్పుల్ కలర్). నోటుపై గుజరాత్ లోని పురాతన కట్టమైన రాణికి వావ్ అనే మెట్లబావి ఫొటో ఉంది. మరికొన్ని రోజుల్లోనే ఈ నోట్లు విడుదల అవుతాయి.

పాత నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని ప్రకటించింది RBI. బ్యాంకుల ద్వారా వీటి పంపిణీ ఉంటుంది. బ్యాంక్ కు వెళ్లే పాత నోటు స్థానంలో.. కొత్త 100 నోటు బయటకు వస్తోంది. ఆగస్ట్ మొదటి వారంలోనే ప్రజల చేతుల్లో పెద్ద సంఖ్యలో 100 నోట్లు ఉండనున్నాయి.

Posted in Uncategorized

Latest Updates