రంజాన్ కు ఫ్రీ పార్కింగ్‌ ఏర్పాట్లు

ramzanfreeparkingరంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఓల్డ్ సిటీలో ఫ్రీ పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. మసీదులు, ఫంక్షన్ హాళ్ల వద్ద ఫ్రీ పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు పోలీసులు. ఎక్కడైతే సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారో ఆ ప్రాంతాలపై దృష్టి సారించారు. చార్మినార్ పెన్షన్ ఆఫీస్, మక్కామజీద్, యాకుత్‌పురా ఫంక్షన్ హాల్, ఫతే దర్వాజా వద్ద ఫ్రీ పార్కింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు ట్రాఫిక్ పోలీసులు. మెహిదీపట్నంతో పాటు మరికొన్నిచోట్ల ఉచిత పార్కింగ్ సదుపాయం కల్పిస్తామన్నారు. ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఇటీవలే ఫుట్‌పాత్ వ్యాపారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు పోలీసు అధికారులు. అందరి సహకారంతో వాహనదారులకు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు ట్రాఫిక్ డీసీపీ కే బాబు రావు.

 

Posted in Uncategorized

Latest Updates