రంజాన్ పండుగకు ముస్తాబైన మసీదులు

ramzanరాష్ట్రంలో రంజాన్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేపు (శనివారం,జూన్-16) ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనాలు చేయనున్నారు ముస్లింలు. ఉదయం 7గంటల నుంచి 11 గంటల వరకు జరిగే ప్రార్థనల కోసం హైదరాబాద్ జంట నగరల్లోని…  మీర్ అలం ఈద్గా, మక్కా మసీద్, మాదన్నపేట, సెవన్ టూమ్స్ తో పాటు అన్ని మసీదులు సిద్ధమయ్యాయి.

రంజాన్ సందర్భంగా సిటీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.  హైదరాబాద్ లోని 600 మసీదుల దగ్గర కట్టుదిట్టమైన భద్రత పెట్టారు. 5వేల మంది సిబ్బందితో పాటు సీసీ కెమెరాలతో నిఘా పెట్టినట్లు చెప్పారు సీపీ అంజనీకుమార్. 50 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించామని, అక్కడ మప్టీలో గస్తీ పెట్టినట్లు చెప్పారు.

రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలకు సీఎం కేసీఆర్, మంత్రులు, సీఎల్పీ నేత జానారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ఐక్యతకు నిదర్శమన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates