రంజాన్ శుభాకాంక్షలు

ramdan mubarakదేశ వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం (జూన్-16) ఉదయం నుంచే ఈద్గాలు కిటికిటలాడుతున్నాయి. హైదరాబాద్ లోని మీరాలం మండి, మాదన్న పేట ఈద్గా, మక్కా మసీదులో ముస్లింలు ప్రార్థనలు చేశారు. రంజాన్ సందర్భంగా సిటీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.  హైదరాబాద్ లోని 600 మసీదుల దగ్గర కట్టుదిట్టమైన భద్రత పెట్టారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 5 వేల మంది సిబ్బందితో పాటు CC కెమెరాలతో నిఘా పెట్టామన్నారు CP అంజనీకుమార్. రంజాన్ పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

రంజాన్ పండుగ ప్రజల్లో సోదరభావాన్ని పెంపొందించడంతోపాటు, సమైక్యతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు గవర్నర్. ఇతరులను గౌరవించడం, పవిత్రమైన జీవితాన్ని గడపడం, అందరి విశ్వాసాలు, గౌరవాన్ని కాపాడేలా ఈదుల్-ఫిత్ ముస్లింలతో ప్రతిజ్ఞ చేయిస్తుందని సందేశంలో తెలిపారు గవర్నర్ నరసింహన్. ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్ రం జాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాస మంతా భక్తిశ్రద్ధలతో ప్రత్యేకప్రార్థనలు చేస్తూ ఉపవాస దీక్షను కొనసాగించడం ముస్లింల ప్రత్యేకతగా అన్నారు . ఈదుల్ ఫిత్‌ న్రు సామూహిక ప్రార్థనలతో ఆనందోత్సాహాల మధ్య, సామరస్యం, సోదరభావం ప్రతిబింబించే విధంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్.

రంజాన్ పండుగను పురస్కరించుకొని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు అందరు కూడా సుఖశాంతులతో రంజాన్ పండుగను నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. బంగారు తెలంగాణ సాధించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి ఆయురారోగ్యాలతో మరింతకాలం రాష్ర్టానికి సేవలు అందించేలా ముస్లింలు ఈద్ నమాజ్ సందర్భంగా ప్రార్థనలు చేయాలని  కోరారు మహమూద్ అలీ.

Posted in Uncategorized

Latest Updates