రండి.. చదువుకోండి : ఎంసెట్, నీట్ కు ఫ్రీ కోచింగ్

kadiyam1ఎంసెట్, నీట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్‌లో చదివే విద్యార్థులకు ఉచితంగా క్లాసులు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు డిప్యూటీ సీఎం మంత్రి కడియం శ్రీహరి. రాష్ట్ర వ్యాప్తంగా 3వేల 500 మంది విద్యార్థులకు 26 సెంటర్లలో ఉచితం ఈ క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సెంటర్‌కు ఒక ప్రిన్సిపాల్‌ను నియమించామన్నారు.

తెలంగాణ రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్‌లో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఉచిత తరగతులు చెప్పే సెంటర్లకు రూ. 15 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా.. పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించాలన్నదే కేసీఆర్ ఆలోచన అన్నారు కడియం. ఆ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులకు అవకాశం కల్పించటానికే ఎంసెట్, నీట్ లో ఉచిత క్లాసులు నిర్వహిస్తున్నాట్లు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates