రకుల్ షాక్ : అందరిముందు ఎత్తుకున్నాడు

RKసిద్దార్థ్‌ మల్హోత్రా హీరోగా రకుల్ నటించిన అయ్యారి సినిమా శుక్రవారం (ఫిబ్రవరి-16)న రిలీజైంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలలో  రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి ఓ వింత అనుభవం ఎదురైంది.  సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా వీరిద్దరు ఢిల్లీలోని ఎస్‌ఆర్‌సీసీ కళాశాలకు వెళ్లారు. అక్కడి విద్యార్థులతో సమావేశమై వారితో కలిసి ఆడిపాడారు. ఈ క్రమంలో రకుల్‌, సిద్దార్థ్‌లను డ్యాన్స్‌ చేయాల్సిందిగా అక్కడి విద్యార్థులు కోరారు. అలా ఇద్దరూ సినిమాలోని లేయ్‌ డూబా  అనే పాటకు డ్యాన్స్‌ చేశారు. అయితే డ్యాన్స్‌ చేస్తుండగా సిద్దార్థ్‌..రకుల్‌ని అందరిముందు ఒక్కసారిగా ఎత్తుకున్నాడు. దీంతో అక్కడున్నవారంతా కేకలు వేశారు. ఒక్క సారిగా షాక్ కి గురైన రకుల్‌.. ఇబ్బంది పడినట్లు కనిపించింది. ఈ కార్యక్రమానికి రకుల్‌ పొట్టి దుస్తులు వేసుకుంది. దాంతో సిద్దార్థ్‌..రకుల్‌ని ఎత్తుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

https://youtu.be/BeUAGQ1LYVU

Posted in Uncategorized

Latest Updates