రక్త కన్నీరు : కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

sensexభారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. పెట్టుబడిదారులకు మంగళవారం రక్త కన్నీరు మిగిల్చింది. ప్రారంభంలోనే సెన్సెక్స్ 900 పాయింట్లు నష్టంతో ఓపెన్ అయితే.. నిమిషాలు గడిచే కొద్దీ పతనం 1200 పాయింట్లకు చేరింది. సెన్సెక్స్ కు ఏ మాత్రం తక్కువ కాదన్నట్లు నిఫ్టీ సైతం 300 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. అదీ ఇదీ అని కాకుండా అన్ని షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. అమెరికాతో సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో కొనసాగటంతో.. ఆ ప్రభావం మనపై ఎక్కువగా పడింది.

బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్ పతనం మొదలైంది. దీర్ఘకాలిక పెట్టుబడులపై వచ్చే లాభంలో 10శాతం పన్ను విధింపుతో పెట్టుబడులుదారులు భయాందోళనకు గురయ్యారు. దీనికితోడు బడ్జెట్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదని అనలిస్టులు అంటున్నారు. ఈ క్రమంలోనే గత శుక్రవారం 800 పాయింట్లు నష్టపోతే.. సోమవారం 300 పాయిట్లు పడిపోయింది. ఇక మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఢమాల్ కావటం, దేశీయ సెంటిమెంట్ రెండూ కలిసి స్టాక్ మార్కెట్ భారీ పతనం దిశగా కదిలింది. ఓపెనింగ్ 900 పాయింట్ల నష్టంతో ప్రారంభం అయ్యి.. 1200కి చేరింది. ఇది 4.6శాతంగా ఉంది. డాలర్ తో రూపాయి మారకం కూడా రూ.64.38కి చేరింది.

Posted in Uncategorized

Latest Updates